తిరుమల, నవంబర్2(జనంసాక్షి) : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే శుక్రవారం విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్వామివారి సేవలో పాల్గొనేందుకు వీలుగా వివిధ ఆర్జిత సేవా టిక్కెట్లను షషష.్‌తీబఎaశ్రీa.శీతీస్త్ర వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన, నిజపాద దర్శనం టిక్కెట్లను లక్కీడిప్ విధానంలో ఆన్‌లైన్‌లో జారీ చేసింది. విశేషపూజ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్ర¬్మత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లను కరెంటు బుకింగ్ కింద వెంటనే బుక్ చేసుకోవచ్చు.
ఫిబ్రవరి నెలకు సంబంధించి 67,146 టిక్కెట్లను తితిదే విడుదల చేసింది. ఇందులో కరెంట్ బుకింగ్ కింద 57,350 ఆర్జిత సేవాటిక్కెట్ల అధికారులు విడుదల చేశారు. సుప్రభాతం 7,096, తోమాల 110, అర్చన 110 , అష్టాదళ పాదపద్మారాధన 180, నిజపాద దర్శనం 2,300, విశేష పూజ 2,000, కల్యాణోత్సవం 12,825, ఊంజల్ సేవ 4,050, ఆర్జిత బ్ర¬్మత్సవం 7,425, వసంతోత్సవం 14,850, సహస్ర దీపాలంకరణ 16,200 టిక్కెట్లను భక్తులు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఆన్‌లైన్ లక్కీడిప్‌లో అవకతవకల నేపథ్యంలో ఒకే మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ ద్వారా సేవా టికెట్లు పొందేలా చర్యలు తీసుకున్నట్లు ఈవో సింఘాల్ తెలిపారు. అలాగే డిసెంబర్ 3 నుంచి 12వరకు జరగనున్న తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర¬్మత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆశీర్వచనం పేరుతో పద్మావతి అమ్మవారి కుంకుమ, ఫొటో, అక్షింతలను భక్తులకు అందించేందుకు పోస్టల్ శాఖతో ఒప్పందం కుదర్చుకున్నామన్నారు. ఈనెల 25 నుంచి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈనెల 20, 27 తేదీల్లో వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పిస్తామని, అలాగే ఈనెల 21, 28 తేదీల్లో ఐదేళ్ల చంటి పిల్లల తల్లిదండ్రులకు సుపథం ద్వారా ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు ఈవో సింఘాల్ తెలియజేశారు.
శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల




