Tuesday, 3 November 2026

మైనార్టీలకు అండగా బీఆర్ఎస్ – మంత్రి కొప్పుల..

మంత్రి కొప్పుల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికమైనారిటీలకు బీఆర్ఎస్ పాలనలోనే మంచి అవకాశాలు లభించాయని రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.ధర్మపురి మున్సిపల్ కో అప్షన్ సభ్యుడు ఎండి షబ్బీర్ ఆధ్వర్యంలో రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో శనివారం నాడు పలువురు మైనార్టీ సోదరులు బిఆర్ఎస్ లో చేరారు.హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ వీరికి గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలకు వివిధ వర్గాలకు చెందిన వారు ఎందరో ఆకర్షితులు అవుతున్నారని చెప్పారు.బిఆర్ఎస్ లో చేరిన వారిలో ఎండి. వజీర్, యూసుఫ్, జబ్బార్, ఆరిఫ్, ఫయాజ్, ముజహిద్, మోబిన్, జావీద్, ఆశ్రర్ సహా 50 మంది పాల్గొన్నారు.