Thursday, 5 November 2026

మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

 

 

 

 

హుజూర్ నగర్ ఏప్రిల్ 14 (జనంసాక్షి): హుజూర్నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి మునిసిపల్ కార్యాలయ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన అంబేద్కర్ దేశానికే గర్వకారణం అన్నారు. అంబేద్కర్ మార్గ నిర్దేశాలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ కే.శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.