Sunday, 8 November 2026

లింగమల్ల మహేష్ మృతికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి

లింగమల్ల మహేష్ మృతికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి
•మహేష్ కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
•జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం
•దేహ ద్రాడుధ్య పరీక్షలు నిర్వహించే ప్రభుత్వ యంత్రాంగం వైద్యులను అందుబాటులో ఉంచుకోకపోవడం శోచనీయం

•మహేష్ పార్తివదేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

మహా ముత్తారం డిసెంబర్ 25( జనం సాక్షి) మండల కేంద్రానికి చెందిన గ్రామానికి లింగమల్ల మహేష్ పోలీస్ ఈవెంట్స్ లో పాల్గొని మృతి చెందడం బాధాకరమని మహేష్ పార్థీవ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి మా ముత్తారం గ్రామస్తులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి *మాజీ మంత్రి వర్యులు మంథని ఎమ్మెల్యే శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు మద్దతు తెలిపి అనంతరం మాట్లాడుతూ
గత 8 సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక ఒకేసారి ఒక ప్రణాళిక లేకుండా ఉద్యోగాలు ప్రకటించడంతో మానసిక ,శారీరక ఒత్తిడి కారణంగా మహేష్ మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు.
జాబ్ క్యాలెండర్ నీ విడుదల చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నిమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించిన కూడా ఒకేసారి ఉద్యోగాలను విడుదల చేసి నిరుద్యోగులను అయోమయానికి గురి చేస్తున్నారని తెలిపారు.పోలీస్ రిక్రూట్మెంట్ నిర్వహించే పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ కనీస బాధ్యతగా శారీరక దేహారుఢ్య పరీక్షలు నిర్వహించేటప్పుడు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ నీ అందుబాటులో ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది డాక్టర్లు అందుబాటులో ఉంటే ఈరోజు మహేష్ మృతి చెందేవాడు కాదని అన్నారు.
రిక్రూట్మెంట్ సెంటర్ నుండి ఉస్మానియా ఆస్పటల్ వరకు తీసుక వె