Thursday, 5 November 2026

భారత్ బౌలర్ల దాడి… పాక్ బ్యాట్స్‌మెన్‌లు బెంబేలు…!

ఆదివారం, 15 ఫిబ్రవరి 2015 (జ‌నంసాక్షి)

  kohili-raina

 

క్రికెట్ ప్రపంచకప్‌లో గ్రూపు-బిలో భాగంగా, ఆడిలైడ్‌లో ఆదివారం జరుగుతున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో భారత బౌలర్ల దాడికి పాక్ బ్యాట్స్‌మెన్‌లు బెంబేలెత్తిపోతున్నారు. భారత్ నిర్దేశించిన 301 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ చేపట్టిన పాక్ క్రికెటర్లు బ్యాట్‌ను ఝులిపించలేని స్థితికి చేరుకున్నారు. 24.4 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేయగలిగారు. 
ఈ మ్యాచ్లో.. 301 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 22.3 ఓవర్లకు రెండు వికెట్లను కోల్పోయిన 100 పరుగులు సాధించింది. భారత్ ఆరంభంలోనే పాక్ వికెట్ తీసింది. యువ పేసర్ షమీ ఇన్నింగ్స్ 4వ ఓవర్లో యూనస్ ఖాన్(6) ను అవుట్ చేశాడు. యూనస్.. ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత షెహజాద్ 47 పరుగులు చేసి క్రీజ్‌పై ఉండగా, హారిస్ సొహైల్ 36 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 
ఆ తర్వాత క్రీజ్‌పైకొచ్చిన మిస్బావుల్ హక్ ఏడు పరుగులు తీశాడు. మాక్సూద్, అక్మల్‌లు పరుగులు తీయకుండానే పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత అఫ్రిద్ క్రీజ్‌పైకి దిగారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *