హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి 2014-15 ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మేక్ ఇన్ ఇండియాతో పాటు జీడీపీ పెంపుదలపై దృష్టి పెట్టినట్టు సర్వే పేర్కొంది.
2014-15 ఆర్థిక సర్వే ఆంగ్ల ప్రతి కోసం క్లిక్ చేయండి
ఆర్థిక సర్వే మొదటి విభాగం
ఆర్థిక సర్వే రెండో విభాగం
అనుబంధ పట్టిక
సర్వేలో పేర్కొన్న ముఖ్యాంశాలు
– 2015-16 ఆర్థికవృద్దిరేటు 8.1నుంచి 8.5శాతం మధ్య వుంటుంది.
– రెండంకెల అభివృద్ధి సాధ్యం
– 2014-15 మధ్య ద్రవ్యోల్బణం తగ్గింది. రానున్న ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్థాయిలో కొనసాగవచ్చు.
– భారీ సంస్కరణలను ప్రవేశపెట్టనున్నారు.
– 2014-15లో ఆహారధాన్యాల ఉత్పత్తి 257.07 మిలియన్ టన్నులు
– ఆదాయం పెంచేందుకు ప్రాధాన్యం
– ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరాలంటే ‘జామ్’ కీలకం
– జామ్ అంటే జన్‌ధన్ యోజన, ఆధార్, మొబైల్ నెంబరు
– ఐటీ రంగం, ఐటీ ఆధారిత సేవలు దేశంలో ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో ఒకటి.
– ఈ ఆర్థిక సంవత్సరంలో సాఫ్ట్‌వేర్ సర్వీసుల ఉత్పత్తి 12 నుంచి 14 శాతం పెరగవచ్చు
– ఐటీతో పాటు బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ విధానంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి పాధాన్యత
– దేశంలో పర్యాటకరంగం మంచి పురోభివృద్ధిలో వుంది. 2014లో విదేశీ పర్యాటకుల సంఖ్య 7.1 శాతానికి పెరిగింది.
– టూరిస్ట్ వీసా ఆన్ అరైవల్ కార్యక్రమంలో పర్యాటకరంగానికి మంచి ప్రోత్సాహకం.
– సంప్రదాయ మార్కెట్ నుంచి ఆధునిక రిటైల్ మార్కెట్‌కు వ్యాపార రంగం పురోగమిస్తోంది.
– ఈ-కామర్స్ మార్కెట్ ప్రోత్సాహకంతో పాటు వినియోగదారుల హక్కుల రక్షణకు చర్యలు
– నైపుణ్య అభివృద్ధితో పాటు ఉద్యోగాల కల్పన అనే రెండు అంశాలు మన ముందు సవాళ్లుగా నిలుస్తున్నాయి.
– మహిళా అక్షరాస్యతతో పాటు విద్యాభివృద్ధిని ప్రోత్సాహించేందుకు చర్యలు
– ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడిచేందుకు యత్నం
– రైల్వేల్లో సంస్కరణలు చేపట్టాలి.
– రైల్వేల్లో టెక్నాలజీని అన్ని రంగాల్లోనూ ప్రవేశపెట్టాలి.
– లక్షమెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సౌరశక్తి ప్రాజెక్టులు
– 14 ఆర్థికసంఘం నివేదిక అమలుతో రాష్గాలకు మరిన్ని నిధులు
– వ్యవసాయ ఉత్పత్తులను ఇంటర్నెట్ ద్వారా విక్రయించేందుకు రూ.200 కోట్లతో ఒక పథకం
– వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం జాతీయస్థాయిలో ఉమ్మడిమార్కెట్




