ఉత్తరప్రదేశ్ రాష్ర్ట రాజధాని లక్నోలో దుండగులు బరితెగించారు. హెచ్.డి.ఎఫ్.సి. ఏటీఎంలో డబ్బులు పెడుతుండగా తుపాకులతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. బ్యాంక్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపి, నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనలో ఇద్దరు బ్యాంక్ అధికారులు చనిపోయారు.




