Thursday, 5 November 2026

8తేదీన డీఈఓ ఆపీస్ ముందు ధర్నాను విజయవంతం చేయాలి

8తేదీన డీఈఓ ఆపీస్ ముందు ధర్నాను విజయవంతం చేయాలి

డీ టీ ఎఫ్ మండల శాఖ అధ్యక్షలు అంగోత్ భద్రయ్య

జనం సాక్షి, చెన్నరావు పేట

టీచర్స్ ప్రయోజనం కోసం కాకుండ విద్యార్థుల అవసరం కోసం టీచర్స్ సర్దుబాటు ఉండాలని,8తేదీన డీఈఓ ఆపీస్ ముందు ధర్నాను విజయవంతం చేయాలని డీ టీ ఎఫ్ మండల శాఖ అధ్యక్షలు అంగోత్ భద్రయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రభుత్వ నిబంధనల ను ఉల్లంగిస్తూ విద్య రంగానికి మరింత సంక్షోభంలోకి నెట్టే విధంగా వ్యవరిస్తున్న కారణంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బలహీన వర్గాల పిల్లలకు విద్య మరింత దూరం అవుతుందని,విద్య వ్యవస్థ గందరగోళానికి కారణం అవుతున్న వరంగల్ డీఈఓ పై విచారణ జరిపి చర్య తీసుకోవాలని,ఈ నెల 8తేదీన డీఈఓ కార్యాలయం ముందు జరుపతలపెట్టిన ధర్నా ను విజయవంతం చేయాలని కోరారు.స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ సరళ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులను వక్రీకరిస్తూ కొంత మంది టీచర్ లు తమ సౌలభ్యం కోసం పైరవీ ల ద్వారా తమకు అనుకూలమైన ప్రాంత పాఠశాల కోసం అవినీతి ని ప్రోత్సహిస్తున్నారు.ఇదే అదనుగా ఉన్నత అధికారులు లంచాలకు అశపడి తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు అలాంటి అధికారులను సస్పెండ్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమము లో యాకయ్య, ఉమాశంకర్ ,కొమురయ్య ,కట్టస్వామి ,రవి ,ఈర్య ,రోజా,పుష్ప ,దేవి ,వెంకటయ్య ,వీరన్న ,వెంకన్న తదితరులు పాల్గోన్నారు.