భారీతీయ కళల్లో చేనేతదే అగ్రపీఠం


శుభాకాంక్షలు తెలిపిన పవన్‌ కళ్యాణ్‌
అమరావతి,ఆగస్టు7(జనంసాక్షి): భారతీయ కళల గురించి మాట్లాడాల్సి వస్తే ..ముందుగా మాట్లాడవలసింది చేనేత కళా రంగం గురించే అని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేనేత కార్మికులందరికీ శుభాకాంక్షలుతెలిపారు. మన భారత దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన కళారంగం చేనేత అని పవన్‌ కొనియాడారు. నా పక్షాన, జనసేన పక్షాన చేనేత కళాకారులందరికీ హృదయపూర్వక కళాభివందనాలు. చేనేత అభివృద్ధికి జనసేన కూడా ఇతోధిక కృషి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ’జనసేన చేనేత వికాస విభాగం’ ఏర్పాటు చేశాం. చేనేత కళాకారుల సమస్యల పరిష్కారం, వారి అభ్యున్నతికి ఈ వికాస విభాగం పాటుపడుతుందన్నారు. చేనేత ఉత్పత్తులకు మరింత ప్రచారం కల్పించేందుకు నన్ను నేను చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటించుకున్న సంగతి విూ అందరికీ విదితమే. ఈ కృషి ఇక విూదట కూడా ఇదే విధంగా కొనసాగుతుందని తెలియ చేస్తున్నాను. చేనేత దినోత్సవం సందర్భంగా యావత్‌ జాతికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. చేనేతను ధరిద్దాం ` చేనేత కళాకారులను ప్రోత్సహిద్దాం ` భారతీయ చేనేత కళారంగాన్ని కాపాడుకుందామని పవన్‌ పేర్కొన్నారు