బెజ్జంకి,జూలై..(జనంసాక్షి): మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బుధవారం బండి లచ్చయ్య,కిష్టారెడ్డి ఇండ్లు కూలిపోయినవి.తక్షణమే ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్ మరియు ఉప సర్పంచ్ బండి వేణు యాదవ్ స్పందించి వారిని పరామర్శించి వారు ఉండడానికి అనువైన సురక్షిత ప్రాంతానికి వారిని తరలించినారు.భారీవర్షాలకు అప్రమత్తంగా ఉండాలని శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఎవరూ నిర్వహించరాదని అలాంటివారు ఇంకెవరైనా ఉంటే మాకు తెలియజేయాలని వారికి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్ అన్నారు.
Attachments area




