Wednesday, 4 November 2026

భారీ వర్షాలతో సహాయ చర్యలకు ఆటంకం

ఉత్తరాఖండ్‌ : ఉత్తర కాశీ, చమోలీ, డెహ్రాడూన్‌, జాలిగ్రంట్‌, కుమోన్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం వరకు పంత్‌నగర్‌లో 15 సెంటీ మీటర్లు, ముసోరిలో 14, డెహ్రాడూన్‌లో 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. సంగ్లా లోయ, కిన్నార్‌, నాకో ప్రాంతాల్లో పలువురు యాత్రికులు చిక్కుకుని ఉన్నారు. హర్షిల్‌ గంగోత్రి నుంచి 430 మంది యాత్రికులను సహాయ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *