భార్యతో బలవంతపు శృంగారం నేరం?

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19: భార్యతో బలవంతం శృంగారాన్ని నేరంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంపై చట్టం తీసుకువచ్చే విషయాన్ని చురుకుగా పరిశీలిస్తున్నట్టు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రి మేనకా గాంధీ వెల్లడించారు. ఈ దిశలో ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆమె తెలియజేశారు. నిజానికి ఇదే విషయంపై గత నెలలో పార్లమెంటులో ప్రకటన చేసిన మంత్రి.. ‘ఈ అంశం దేశీయ పరిస్థితులకు అనుగుణం కాదు..’ అనడంతో సభలో గందరగోళం రేగింది.