Tuesday, 3 November 2026

భార్యపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని హత్య చేసిన భర్త

నిజామాబాద్‌ గ్రామీణం: భార్యపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని దారుణంగా భర్త హత్య చేసిన ఘటన నిజామాబాద్‌ గ్రామీణ మండలం నర్సింగ్‌పల్లిలో చోటుచేసుకుంది. ఈ ఉదయం నెయ్యి అమ్ముకోవడానికి గ్రామానికి వచ్చిన వ్యక్తి ఓ ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారయత్నం చేశాడు. వెంటనే ఆమె పెద్దగా కేకలు వేయడంతో భర్త వచ్చి అతని తలపై రాడుతో కొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం రంపంతో మృతదేహాన్ని ముక్కలు చేశాడు. తర్వాత పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *