Tuesday, 3 November 2026

భార్యాభర్తల లొల్లి ఆర్టిసి బస్సు అద్దం ధ్వంసం

బషీరాబాద్ జూలై 04, (జనం సాక్షి) బషీరాబాద్ మండలం కేంద్రంలో సున్నం బట్టి దగ్గర మైల్వార్ గ్రామం నుండి తాండూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నెంబర్ ఏపీ 28 జెడ్ 1950 గల బస్సును ఓ వ్యక్తి భార్యతో గొడవ పడి రోడ్డుపైకి వచ్చి మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ముందుభాగానికి రాయితో కొట్టడం వలన ఆర్టీసీ బస్సు ముందు భాగం అద్దం ధ్వంసం కావడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆ వ్యక్తిని పట్టుకొని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.