ఇల్లందు జూన్ 4 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో స్థానిక కరెంట్ ఆఫీస్ సెంటర్ నుంచి లలితాపురం వరకు పది కోట్ల రూపాయల డీఎంఎఫ్టి నిధులతో రోడ్ల నిర్మాణాo కొరకు సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పరిశీలించారు.ఈ మంగళవారం రోజు ఇల్లందు మండలం సుభాష్ నగర్ గ్రామపంచాయతీ లోని ప్రధాన రహదారినీ డీఎంకే ,డీ ఎం ఎఫ్ టీ ద్వారా 10 కోట్ల రూపాయల నిధులతో నిర్మించబోయే రోడ్డు డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ మరియు సైడ్ ట్రైన్ల పనులకు సంబంధించిన రోడ్లను ఈరోజు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరి సింగ్ నాయక్ ఆర్ & బీ సీఈ మోహన్ నాయక్ ,స్ ఈ 4. బి లక్ష్మణ్,ఎల్ ఈ ఈ బానోత్ భీమ్లా ,డీ ఈ వెంకటేశ్వరరావు,ఏ ఈ లు రాంబాబు, మోతిలాల్, పరిశీలించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తేనెటీవ్ ఇందులో పాల్గొని సీఈఓ మోహన్ నాయక్ ని సన్మానించిన ఎమ్మెల్యే దంపతులు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు , ఇల్లందు మండలం వైస్ ఎంపీపీ ప్రమోద్ సుభాష్ నగర్ సర్పంచ్, వల్లాల మంగమ్మ, ఇల్లందు మండలం అధ్యక్షుడు శీలం రమేష్, ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, ఇల్లందు మండల ఇన్చార్జి యల్లమద్ది రవి, ఇల్లందు మండల కోషన్స్ సభ్యులు ఘాజి, రైతు సంఘం సభ్యులు పూనం కమలమ్మ, సుభాష్ నగర్ వార్డ్ నెంబర్ ఆళ్ల నాగేశ్వరావు, ఇంద్రనగర్ వార్డ్ నెంబర్ నీలం రాజశేఖర్,ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి సాతాల హరికృష్ణ ఇల్లందు మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పొందూరి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.





