జనంసాక్షి, కమాన్ పూర్ : కమాన్ పూర్ మండలంలోని బాపూజీ నగర్ కు చెందిన రాధారపు శ్రీనిధి ఇంటర్ మొదటి సంవత్సరంలో బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం సాదిoచగ మంథని ఎమ్మెల్యే దుద్దుల శ్రీధర్ బాబు వారి ఇంటికి వెళ్లి విద్యార్థిని శాలువతో సత్కరించి అభినందించారు. భావి భారత నిర్మాణానికి నేటి విద్యార్థులే పునాదులని, విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో మనస్పూర్తిగా కృషి చేస్తే అనుకున్న లక్ష్యాలతో విజయం సాధిస్తారని ఏఐసీసీ సెక్రెటరీ, మాజి మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వైనాల రాజు,రంగు సత్యనారాయణ గౌడ్,భూoపెళ్లి రాజయ్య,ఆకుల ఓదేలు,తోగరీ అశోక్, షేవ్వ శంకరయ్య,జెమినీ గౌడ్, పెండ్యాల రాజు ,కొంతం శ్రీనివస్, కుందారపు బాపు , అఫ్సర్,బొజ్జ సతీష్ గుమ్మడి శ్రీనివాస్,పోతుల కుమార్ కుక్క రవి,కోల నర్సగౌడ్,బిల్లా కృష్ణ , ఇరుగురాల శేఖర్ తదితరులు ఉన్నారు.
భావి భారత నిర్మాణానికి నేటి విద్యార్థులే పునాదులు – మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు




