Tuesday, 3 November 2026

సీఎం కేసీఆర్ కృషితో గ్రామాలు అభివృద్ధి -ఎంపీపీ శైలజ, జడ్​పీటీసీ మీనాక్షి

మునిపల్లి, మే 29, జనంసాక్షి : గ్రామాలాభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ శైలజ శివశంకర్​, జడ్​పీటీసీ పైతర మీనాక్షి సాయికుమార్​ అన్నారు. సీఎం కేసీఆర్ కృషితో గ్రామాల రూపురేకలు మారుతున్నాయన్నారు. ఈసందర్బంగా అందోల్​ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్​ ఆదేశాల మేరకు సోమవారం నాడు మండల పరిధిలోని పెద్దలోడి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిసి రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ పార్వతి అశోక్, ఎంపిటిసి రేణుక వెంకటేశంతో కలిసి ఎంపీపీ శైలజ శివశంకర్ , జడ్పిటిసి పైతర మీనాక్షి సాయికుమార్ లు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశ్ కి నేత ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సహకారంతో మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పెద్దరుడి గ్రామంలో గత నాలుగేళ్లుగా లేదా నిధుల నుండి మంజూరైన రూ. 50 లక్షల పనులు జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, నాయకులు శివశంకర్, అల్లం నవాజ్ రెడ్డి, మాజీ ఎంపీపీ చెంద్రన్న, మాజీ ఎంపిటిసి వెంకటేశం, బిఆర్ఎస్ మండల యువత అధ్యక్షుడు ఆనంద్, గ్రామ ఉప సర్పంచ్ జగదీశ్వర్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.