Tuesday, 3 November 2026

శర మామూలే. అధికారులు తీరు మారలే ఆలస్యంగా ప్రారంభమై త్వరగా ముగిసిన సర్వసభ్య సమావేశం

 

బాల్కొండ మే 29 (జనం సాక్షి) బాల్కొండ, మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి అధి కారులు సమయానికి హాజరు కావడం లేదని, గత మండల సర్వసభ్య సమావేశంలో చెప్పినా స్పందన కరువైందని ఎంపీపీ లావణ్య, అసహనం వ్యక్తం చేశారు. వచ్చే మండల సర్వసభ్య సమావేశానికి సకాలంలో హాజరు కావాలని ఆదేశించిన… అయినా అధికారులు సమయపాలన పాటించడం లేదని అసహనం వ్యక్తం చేశారు, మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ లావణ్యా అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వ హించారు. మండల సభ ఉదయం 10:30 గంట లకు నిర్వహించాల్సి ఉండగా కొందరు అధికా రులు ఆలస్యంగా రావడంతో 11:50 గంటలకు సభ ప్రారం భమైంది. మధ్యాహ్నం ఒంటి గంటల వరకు కొనసాగింది. ఒక గంట 10 నిమిషాల్లోనే సమావేశం ముగిసింది. ముఖ్యంగా సమావేశంలో ఎంఈఓ రాజేశ్వర్ మాట్లాడుతూ… మన ఊరు మన బండి కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని నాగపూర్ జలాల్పూర్ బోదెపల్లి గ్రామాల్లో పనులు పూర్తయ్యాయని త్వరలో ప్రారంభమవుతాయన్నారు, విద్యుత్ అధికారి ఏఈ సీసీ రోడ్డు మధ్యలో ఎలక్ట్రిసిటీ పోల్ ఉన్నది దాన్ని తీసివేయడం అని అడగగా బాల్కొండ గ్రామ సర్పంచ్ విద్యుత్ స్తంభం తీసేయడానికి డిడి డబ్బులు కడితే తీసేస్తామని సమాధానం ఇచ్చారు,కొందరు మండల అధికారులు వారు చేసిన పనులు చెప్పకుండా కేవలం పేరు వృత్తి చెప్పుకుంటూ కూర్చున్నారు.ఈ సమావేశంలో, ఎంపిడిఓ సంతోష్ కుమార్, తహసిల్దార్ వినోద్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ నవీన్,ఎంపీటీసీ , ఎంఈవో రాజేశ్వర్, ఎంపీటీసిలు రామ్ రాజ్ గౌడ్, ఈ,పి. నారాయణ..కన్న పోషెట్టీ లింగవ్వ, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ , ఏఈఓ నీహారిక, వివిధ గ్రామాల సర్పంచులు. నోముల రవి, బూస సునీత, గడ్చండ కల్పన,అనిల్, ఏపీవో ఇందిరా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.