Monday, 2 November 2026

భావ ప్రకటన స్వేచ్ఛ ను దుర్వినియోగం చేయడం తగదు

భావ ప్రకటన స్వేచ్ఛ ను దుర్వినియోగం చేయడం తగదు
ఖమ్మం అర్బన్, (డిసెంబర్ 31) హిందూ దేవుళ్ల పట్ల రెండు రోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో భైరి నరేష్ అనే వ్యక్తి అభ్యంతరకర భాషను వాడుతూ భావ ప్రకట స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం తగదని బహుజన జెఎసి జిల్లా చైర్మన్ దేశబోయిన సంపత్ కుమార్ అన్నారు. శనివారం రోడ్లు భవనాల అతిథి గృహం ఎదుట ఈ విషయంపై నిరసన ప్రకటిస్తూ మాట్లాడారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీయటం, గాయపరచడం వంటి చర్యలు వేరే వారి భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం లాంటిదేనని తెలిపారు. కొడంగల్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో నరేష్ అనే వ్యక్తి హిందూ దేవుళ్ళ ను కించపరచడం లక్ష్యంగా అభ్యంతరకర పదాలను ఉపయోగించడం ఏ విధంగానూ సమంజసం కాదన్నారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన జేఏసీ జిల్లా కన్వీనర్ సందీప్, పాలేరు నియోజకవర్గ కన్వీనర్ సర్వ నాగసంతోష్, నాయకులు లింగయ్య యాదవ్, కిషోర్, దండి దీపక్, రుద్ర సాయి, బోయపాటి అఖిల్, రాజేష్, బర్మా సాయి, హర్ష, గుండా మహేష్ తదితరులు పాల్గొన్నారు.