Monday, 2 November 2026

హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచుతా – జనవరి 6న మంత్రి కేటీఆర్

హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచుతా – జనవరి 6న మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలి – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ డిసెంబర్ 31 (జనంసాక్షి): హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచుతానని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ జనవరి 6 తేదీన రాష్ట్ర, ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలిపారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, 30 కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఈఎస్ఐ ఆసుపత్రి, ఎస్ టి ఓ ఆఫీస్, బస్తీ దవఖాన ప్రారంభిస్తారని తెలిపారు. కీతవారిగూడెం, తాళ్ల మల్కాపురం బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన, రామస్వామి గట్టు వద్ద ఉన్న మోడల్ కాలనీ గృహాలను అభివృద్ధి చేయడం పనులు, హుజూర్ నగర్ నియోజకవర్గానికి అనేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తుంటే ప్రతిపక్షాలు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారన్నారు. నియోజకవర్గ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారన్నారు. పట్టణంలో రోడ్లు అన్నీ దరిదాపు పూర్తి కావచ్చాయన్నారు. అభివృద్ధిపై చర్చకు ఎప్పుడు సిద్ధమేనని ఎమ్మెల్యే అన్నారు. అభివృద్ధి కోసం ఎంత పోరాడాల్సి వచ్చిందో కేసులతో కూడా అంతే పోరాడాల్సి వచ్చిందన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు లక్ష్మీ నరసింహ రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింగ్ వెంకటేశ్వర్లు, పచ్చిపాల ఉపేందర్ యాదవ్, యడ్ల విజయ్, సోమగాని ప్రదీప్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.