Monday, 2 November 2026

ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ ను సన్మానించిన రాములు నేత

ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ ను సన్మానించిన రాములు నేత
జహీరాబాద్ డిసెంబర్ 31 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు రాములు నేత ఇంటి లో తేనీరు స్వీకరించిన ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కుసుమ జగదీష్ శనివారం షిరిడి వెళుతున్న ఆయన రాములు నేత ను వారి ఇంటిలో కలసిన సందర్భంగా రాములు నేత ఆయన కు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాములు నేత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నప్పటి నుండి కుసుమ జగదీష్ చాలా మంచి మిత్రులు కవున నూతన సంవత్సరం జరుపుకోవడానికి మరి ఏదైతే శిరిడీలోని సాయిబాబా మందిరానికి వెళుతూన్న సందర్భంగా కలువడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ మోతి రామ్ నాయక్ మరియు జైరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం జనార్ధన్ కార్యదర్శి కర్దాస్ మనోహర్ మాజీ జడ్పిటిసి మాణిక్యమ్మ టిఆర్ఎస్ పార్టీ నాయకులు టైలర్ శంకర్ తదితరులు ఉన్నారు.