– అసెంబ్లీ సమావేశాల్లో మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు
జనంసాక్షి , మంథని : సింగరేణి సంబంధించిన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి సంబంధించిన 271 మంది భూ నిర్వాసితులకు సంబంధించి ల్యాండ్ కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది.. కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని అనేక రోజులుగా ప్రభుత్వ పరంగా నిరసన తెలిపిన అప్పటికి వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నేటికీ అందలేదన్నారు.తమ నియోజక వర్గానికి ఈ మధ్యలో మంత్రి ఈశ్వర్, మంత్రి హరీష్ రావు వచ్చినప్పుడు వారికి కూడా చెప్పడం జరిగిందని, సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కి లద్నాపూర్ గ్రామ ప్రజలు అందరూ ఎలిజిబుల్ అని తాసిల్దార్, ఆర్డీవో చెప్పిన..కలెక్టర్ సింగరేణి మీద సింగరేణి వారు కలెక్టర్ పంపించడం లేదు అని చెబుతున్నారనిఇది చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉందని లద్మాపూర్ గ్రామస్తులకు వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. చందనాపూర్ కు సంబంధించివారి భూములను సింగరేణి ఖాతాలో పడ్డాయి.. కానీ ధరణిలో తప్పులు దొరలడం వల్ల వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రావడం లేదని, సింగరేణి వాళ్ళతో మాట్లాడి వీరికి న్యాయం చేయాలని కోరారు. సింగిరెడ్డిపల్లి సింగరేణి భూ నిర్వాసితులకు సంబంధించి స్టూడెంట్స్ గా పరిగణించకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, అదే విధంగా పెద్దంపేట మంగళపల్లి కొంతమందికి ఆర్ అండ్ ఆర్ మిస్ కావడం జరిగిందని , వారిని కూడా పరిగణలోకి తీసుకొని ఆర్ అండ్ ఆర్ ఇవ్వాలని కోరారు. రచ్చపల్లి గ్రామంలో కూడా మిస్సయిన వాళ్లకి ఆర్ అండ్ ఆర్ ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.




