భువనగిరి: వరంగల్ జిల్లా కాజీపేటలో ఏర్పాటు చేసిన తెదేపా ప్రాంతీయ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్తున్న అపార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు నల్గొండ జిల్లా భువనగిరిలో ఘనస్వాగతం లభించింది. బొమ్మాయిపల్లి చౌరస్తా వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తలు బాబుకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు నరసింహ, కార్యదర్శి ఇక్బాల్ చౌదరి, వీరేశం, శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు.




