Wednesday, 4 November 2026

10వ తేది తర్వాత వచ్చిన గృహలక్ష్మి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలి: మాజీ కౌన్సిలర్ లయిక్ అహ్మద్

భువనగిరి టౌన్ జనం సాక్షి:-

మనతెలంగాణ/భువనగిరి: మున్సిపల్ పట్టణంలోని పలు వార్డులో గృహలక్ష్మి పథకం కింద 10 వ తేదీ తర్వాత వచ్చిన గృహలక్ష్మి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టి వారికి సైతం గృహలక్ష్మి పథకం కింద మూడు లక్షల రూపాయలు వచ్చే అవకాశం కల్పించాలని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పరిపాలన అధికారి జగన్ ను మాజీ కౌన్సిలర్ మహ్మద్ లయిక్ అహ్మద్ కోరారు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి జగన్ ను కలిసిన ఆయన గృహలక్ష్మి అర్హుల దరఖాస్తులను పరిశీలించి అందరికీ న్యాయం చేయాలని కోరారు ఈకార్యక్రమాలలో అహ్మద్ బబ్బు , సల్మాన్ ఖాన్, సిరాజ్, సయ్యద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.