Thursday, 5 November 2026

భూపతి కృష్ణమూర్తి మృతి తీరనిలోటు: కడియం

వరంగల్‌,ఫిబ్రవరి16(  జ‌నంసాక్షి ):  తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి మృతి తీరని లోటని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్‌లో అన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణమూర్తి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కృష్ణమూర్తి అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని…. తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు పాల్గొనాలని కోరారు. కృష్ణమూర్తి భౌతికకాయాన్ని వివిధ పార్టీల నేతలతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు తెరాస ఎమ్యెల్యేలు, ఎంపీలు సందర్శించి నివాళులర్పించారు. జెఎసి నేత కోదండరామ్‌, ఉన్నతవిద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి తదితరులు ఆయనకు నివాళులు అర్పించారు. జిల్లా టిఆర్‌ఎస్‌ నేతలు కూడా నివాళి అర్పించారు. కృష్ణమూర్తి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరుగుతాయని కడియం తెలిపారు. కృష్ణమూర్తి భౌతికకాయానికి పలువురు నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *