Tuesday, 3 November 2026

భూసార పరీక్షలతో అధిక లాభాలు పొందవచ్చు: వ్యవసాయ శాఖాధికారి

బీర్కూర్‌ గ్రామీణం, జనంసాక్షి: రైతులు అధిక దిగుబడులను పొందేందుకు భూసార పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవాలని మండల వ్యవపామ శాఖాధికారి పేర్కొన్నారు. బీర్కూర్‌ మండలం నస్రుల్లాబాద్‌లో నిర్వహించిన రైతు చైతన్య యాత్రలో ఆమె పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. రాబోయే ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన వ్యవసాయ పరికరాలను రాయితీపై పొందేందుకు రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *