Monday, 2 November 2026

భూ నిర్వహితుల రైతులను అక్రమ అరెస్ట్ చేసి జైల్లో ఉన్న రైతులను కలిసి పరామర్శించిన కుంభం

భువనగిరి టౌన్ ( జనం సాక్షి ):–అక్రమంగా అరెస్టు అయిన ట్రిపుల్ ఆర్ నిర్వాసితులను పరామర్శించిన భువనగిరి డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి న్యాయం కోసం పోరాటం చేస్తున్న రైతులను ఇలా అరెస్టులు చేసి ఇబ్బందులకు గురి చేయడం దారుణమని అనిల్ కుమార్ రెడ్డి ట్రిపుల్ ఆర్ బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల కొరకు ఏమైనా చేస్తా అని ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే రైతుల ముందుకు వచ్చే ధైర్యం లేక కుంటు సాకులు చెప్తూ కాలయాపన చేస్తూ, రైతుల నోట్లో మట్టి కొడుతున్నాడు.ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే స్పందించి, ముఖ్యమంత్రి దగ్గరకు త్రిబుల్ ఆర్ బాధితులను తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలిఈ కార్యక్రమంలో సత్యనారాయణ,కృష్ణ యాదవ్,సలావుద్దీన్,విద్యాసాగర్,ఎంపీపీ రమేష్ రాజు,సత్తిరెడ్డి, పాశం శివానంద్, చిక్కుల వెంకటేష్, రఘుబాబు, కూర వెంకటేష్ అంగడి నాగరాజు జిట్టా,మల్లారెడ్డి,ఎడ్ల శ్రీనివాస్, చుక్క స్వామి, పోకల యాదగిరి రైతులు పాండు రమేష్ తదితరులు