Wednesday, 4 November 2026

శివంపేట మండల ఖ్యాతి రాష్ట్ర నలుమూలలకు చేరింది  నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి

శివ్వంపేట మార్చి 24 జనంసాక్షి :
ప్రజలు మిమ్మల్ని నమ్మి సర్పంచులుగా గెలిపిస్తే గ్రామంలో అభివృద్ధి పనులు చేసి ప్రజల మన్ననలు పొందడం అభినందనీయమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాల అభివృద్ధిలో 9 అంశాలపై నిర్వహించిన సర్వేలో  జాతీయ పంచాయతీ అవార్డు లకు ఎంపికయినా ఆయా గ్రామాల సర్పంచులను, ఎంపీటీసీలను, పంచాయతీ కార్యదర్శులను ఎంపీపీ కల్లూరి హరికృష్ణతో కలసి ఎమ్మెల్యే మదన్ రెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించి, మెమోంటోలను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచులు ఎంతో కస్టపడి మంచినీటి సరఫరా, పారిశుధ్యం, హరితహారంలో మొక్కలు నాటడం, సీసీ రోడ్లు వేసి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించడంలో క్రియాశీల పాత్రను పోషిస్తున్న సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు వారి హయాంలో చేసిన మంచి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. సీఎం కేసీర్ కలలు గన్న బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ, గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకుందామని ఆయన సూచించారు. గిరిజన తండాలను సీఎం కేసీర్ ప్రత్యేక పంచాయతీలుగా ప్రకటించారని, నూతనంగా ఏర్పడ్డ 84 గ్రామపంచాయతీలకు భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని, మీ హయాంలోనే గ్రామపంచాయతీ కార్యాలయలను నిర్మించండని ఆయన అన్నారు. అవార్డుకు ఎంపిక కానీ గ్రామాలను మరింత అభివృద్ధి చేసి జాతీయ పంచాయతీ అవార్డును రాష్ట్ర స్థాయిలో సాధించే విదంగా కృషి చేయాలని ఆయన అన్నారు. అవార్డు అందుకున్న వారిలో అల్లీపూర్, కొత్తపేట, రూప్ల తండా,రత్నాపూర్,తిమ్మాపూర్, చిన్నగొట్టిముక్కుల, పెద్దగొట్టిముక్కుల,గోమారం, సికింద్లాపూర్, బిజిలిపూర్,నవాబ్ పేట,గంగాయిపల్లి, మగ్దుంపూర్, పాంబండ,శబాష్ పల్లి, మల్లుపల్లి, గుండ్లపల్లి, కొంతాన్ పల్లి, దంతాన్ పల్లి సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శిలను సన్మానించడం జరిగినది. ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి,జిల్లా గ్రంధాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జెడ్పి కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, మండల ప్రత్యేకాధికారి నర్సయ్య, పీఎసీఎస్ చైర్మన్ చింతల వెంకట్రాంరెడ్డి,రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు బానోత్ రవి నాయక్, మండల కో ఆప్షన్ మెంబర్ లాయక్,ఎంపీడీఓ తిరుపతి రెడ్డి, కార్యాలయ సూపరిండెంట్ చంద్రశేఖర్, సీనియర్ అసిస్టెంట్ నరేందర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ జీవన్, మంద స్వామి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి
సాధారణ సర్వసభ్య సమావేశంలో
ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ
శివ్వంపేట: అధికారులు ప్రజాప్రతినిధులు  సమన్వయంతో పనిచేసి  మండలానికి మంచి పేరు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని  ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షులు, శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ పల్లెల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు కేటాయింస్తుంటే, నర్సాపూర్ ఏమ్మెల్యే మదన్ రెడ్డి సహాయ, సహకారాలతో శివ్వంపేట మండలానికి, ఎస్డీఎఫ్, సీడీఎఫ్ నిధులతో గ్రామాలలో సీసీ రోడ్లు, వైకుంఠ దామాలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, మన ఊరు -మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలను బాగుచేసుకున్నామని ఆయన అన్నారు. వేసవి దృష్టిలో ఉంచుకుని గ్రామలలో మంచినీటి ఎద్దడీ రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అందుకు సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్ లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. సాధారణ సర్వసభ్య సమావేశానికి వచ్చే అధికారులు సరైన వివరాలతోసభకు రావడం లేదని, పద్ధతి మార్చుకోవాలని ఎంపీపీ ఆదేశించారు. సభ ద్రుష్టికి వచ్చిన సమస్యలను ఉన్నతాధికారుల ద్రుష్టికి తీసుకెళ్లే విదంగా ప్రణాళికలను తయారు చేసి, వచ్చే సాధారణ సర్వసభ్య సమావేశం వరకు సమస్యను పరిష్కరించే విదంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ చంద్రాగౌడ్, వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి, జెడ్పి కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, కో ఆపరేటివ్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఎంపీడీఓ తిరుపతి రెడ్డి, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.