హుజూర్ నగర్ మే 29 (జనంసాక్షి): మున్సిపల్ పరిధిలోని మాధవరాయిని గూడెం పర్యటనలో భాగంగా సోమవారం హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, పక్షవాతంతో మంచానికే పరిమితం అయిన పార్ధబోయిన వెంకటమ్మ ఇంటికి వెళ్లి ఆమెను పలకరించి, యోగక్షేమాలు తెలుసుకొని, వైద్యం కోసం హాస్పిటల్ కు కాల్ చేసి చెబుతాను బయపడకు, నేనున్నాను అని భరోసా ఇస్తూ, మందులకు ఆర్ధిక సహాయాన్ని అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




