Tuesday, 3 November 2026

మంచినీటి చెరువులలో చేపలు పెంపకం శిక్షనా కార్యక్రమం

కూసుమంచి అక్టొబర్ 9 (జనంసాక్షి); పాలేరు లోని శ్రీపివీ నర్సింహారావు మత్స్యపరిశోదన కేంద్రంలో మత్స్యకారులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం మంగళవారం 22వ రోజుకు చేరినది.పరిశోదన కేంద్రం ప్రదానశాస్ర్రవేత్త విద్యాసాగర్ రెడ్డి పర్యవేక్షణలో డాక్టర్ లవకుమార్ శాస్త్రవేత్త చేపలకు శత్రువులు అయిన పక్షులు, కప్పులు, పాములు, దోమలను నిర్మూలించాలని లేనిపక్షంలో చేపల పెంపకం భారంగా ఉంటుందని చెప్పారు.కె.వి.కెమామునూరు శాస్త్రవేత్త శ్రీ బాలాజీ మాట్లాడుతూ ప్రస్తుతం 167మిలియన్ మెట్రిక్ టన్నుల చేపలు అవసరం ఉంది అని అది 2030నాటికి పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వారి ఆహారలోటు తీర్చడానికి 330మిలియన్ మెట్రిక్ టన్నుల చేపలు ఉత్పత్తి అవసరం ఉంది అని తెలిపారు.దానికనుగుణంగా ఇప్పటినుంచే చేపల పెంపకం ఉత్పత్తి ప్రణాళికలు రూపొందించు కోవాలని సూచించారు.టెక్నికల్ అధిపతి శ్రీ వై.వి.రమణ మాట్లాడుతూ మట్టిలో రకాల వలన చెరువులలో నీరు ఇంకే అవకాశం ఉంది అని దానిని పాలధీన్ కవర్లు తో గాని సిమెంట్ తో గాని దీనిని నిర్మూలించాలని అదే విధంగా చేపలకు  వేసేమేతలలోని రకాలు మేత వేసే విధానాలను వివరించారు.