భువనగిరి టౌన్ (జనం సాక్షి:):– ఏప్రిల్ 14వ తేదీన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరగబోయే సత్యాగ్రహ సభను విజయవంతం చెయ్యాలని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార రెడ్డి గారు పిలుపునిచ్చారు. భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామిక పాలన అందించడంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అందులో భాగంగానే అణిచివేతలని తెలియజేసారు. ఈ నెల 14న మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగే హత్ సే హాత్ జోడో సత్యాగ్రహ సభను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎస్ యు ఐ నాయకులు బారి ఎత్తున హాజరై విజవంతం చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఇంచార్జి ప్రదీప్ గౌడ్, టీపీసీసీ డెలికేట్ తంగళ్ళపల్లి రవికుమార్, ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, వలిగొండ జడ్పిటిసి అనంతరెడ్డి ,నూతి రమేష్, స్థానిక కౌన్సిలర్లు ఈరపాక నరసింహ, సలావుద్దీన్,, పచ్చర్ల జగన్, ఆదినారాయణ, చల్లగురుగుల రఘుబాబు స్థానిక నాయకులు పిట్టల బాలరాజ్, అంగడి నాగరాజ్, ఎడ్ల శీను, గుర్రాల శీను, హరిప్రసాద్ కూర వెంకటేష్ సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.




