మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్,ప్లే ఓవర్ బ్రిడ్జిని పరిశీలించిన సీపీఎం నాయకత్వం
ప్రయాణికుల బాధలు పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు
జిల్లా కేంద్రంలో బైపాస్,ఫ్లై ఓవర్ రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలకు కారణం ఎవరు?
ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రయాణికులు ప్రమాదాలకు గురికావాల్సిందేనా?
అభివృద్ధి చేసామని చెప్పుకుంటున్న పాలకులకు,అధికారులకు బైపాస్, ఫ్లై ఓవర్ రోడ్లు ఎట్లా ఉన్నాయో కనిపించడం లేదా?
సిపిఎం మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాయకులు ఈరోజు బైపాస్, ఫ్లైఓవర్ రోడ్లను పరిశీలించి బాధితులతో, ప్రయాణికులతో మాట్లాడడం జరిగింది.
ఈ రెండు రోడ్లను చూస్తుంటే ఎంత అభివృద్ధి చేశారో ప్రజలందరికీ అద్దంలో చూసినట్టు కనిపిస్తోంది.ప్రభుత్వ జిల్లా అధికారులంతా జిల్లా కేంద్రంలో ఉన్నప్పటికీ ఈ రోడ్ల దుస్థితి మీకు కనిపించడం లేదా?అని సిపిఎం అడుగుతుంది
ఈ రోడ్లమీద ప్రయాణం చేసే ప్రయాణికులు అనేక ప్రమాదాలకు గురై గాయాలపాలై ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి ప్రాణాలు కోల్పోయినవారు కూడా ఉన్నారు.రోజు ఏదో ఒక్క ప్రమాదం జరుగుతున్నాయని తెలిసినప్పటికీ బైపాస్ రోడ్డును సంవత్సర కాలం అయిన ఇప్పటివరకు రోడ్డును వెయ్యకుండ వదిలేశారు.దుమ్ము, దూళితో రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులు, ఇండ్లు దుమ్ముతో నిండిపోయి ప్రజల అరోగ్యాలు చెడిపోతున్నాయి. మంచిర్యాల ప్లై ఓవర్ మీదినుంచి వేలాది వాహనాలు రోజు వెళ్లడం జరుగుతుంది.ఈ ఫ్లైఓవర్ పైన ఎక్కడపడితే అక్కడ గుంతలు,డాంబర్ ముద్దలు రోడ్డు సైడ్ లో కాలువలాగా రోడ్డు అలంకరణ కోసం పెట్టిన మొక్కలు ఎండిపోయి ఖాళీ కుండీలు దర్శనమివ్వడం కనిపిస్తుంది.ఈ రెండు రోడ్ల దుస్థితి చూస్తే ప్రజలంటే ప్రభుత్వాలకు,అధికారులకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది.ప్రయాణికుల ప్రాణాలను కాపాడడం కోసం తక్షణమే బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాలి. ఫ్లైఓవర్‌ను మరమ్మత్తులు చేసి రోడ్డు వేయాలి ఈ రెండు పనులను వెంటనే చేపట్టలని ప్రభుత్వానికి, అధికారులకు సిపిఎం మంచిర్యాల జిల్లా కమిటీ తెలియజేస్తుంది.
ఒకవేళ రోడ్డు వేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో
*సంకే రవి సిపిఎం జిల్లా కార్యదర్శి,గుమాస ప్రకాష్,
దాసరి రాజేశ్వరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు,
దూలం శ్రీనివాస్ బోడంకి చందు జిల్లా కమిటీ సభ్యులు,
డి మోహన్,ప్రేమ్ కుమార్ పట్టణ నాయకులు పాల్గొన్నారు




