వడదెబ్బ తగలకుండా ప్రజల్లో చైతన్యం తేవాలి
యాదాద్రి భువనగిరి,మార్చి19(జనంసాక్షి): ఎండతీవ్రత పెరగనున్నందున మండలాల్లో ముందస్తు అవగాహన క్యాంపులను నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. మధ్యాహ్న సమయంలో బయటికి రాకుండా ఉదయం పనులు ముగించేవిధంగా వారికి తెలియజేయాలన్నారు. మండలాలలోని ప్రభుత్వ కార్యాలయాలలో తప్పనిసరిగా చలివేంద్రాలు పెట్టాలని తెలిపారు. వివిధ పనులపై వచ్చే వారికి తాగునీటి వసతి కల్పించాలని చెప్పారు. వేసవి కాలం వచ్చినందున జిల్లాలో ఏ ఒక్కరు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఇటుక బట్టీల వద్ద వర్కర్లను ఉదయం పూటనే పని ముగించేవిధంగా సంబంధిత శాఖాధికారి ఆదేశాలు జారీ చేయాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల పిల్లలు ఎండతీవ్రత ఉన్న సమయంలో బయట తిరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వయోవృద్దులు, పిల్లలు మధ్యాహ్న సమయంలో బయట తిరిగితే వడదెబ్బ తగిలే
అవకాశాలున్నాయని ప్రత్యేకంగా వీరికి వడదెబ్బ రాకుండా చూసేందుకు తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఏ ఒక్కరూ వడదెబ్బకు మృతి చెందినట్లు ఉండకూడదని ముందుగానే ప్రజలకు ఎండతీవ్రతపై వచ్చే ప్రమాదాల గురించి తెలియజేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా పనిప్రాంతాల్లో అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జాగ్రత్త తీసుకోవాల్సిన సూచనలతో పాంప్లేట్లు, బ్యానర్లను సిద్ధం చేసి ప్రజలకు పంపిణీ చేయాలన్నారు. ఉపాధి పనులు, హామాలీ పనులు చేసే పనివారు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు పనిచేసి సాయంత్రం 4 గంటల తరువాత పనులు చూసుకోవాలని తెలిపారు. సంతల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు మార్కెటింగ్ శాఖ టెంటులను, తగిన తాగునీటి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. గ్నిమాపక సిబ్బంది ముందస్తు తమ ట్యాంకులను నీటితో నింపుకొని ఎక్కడ ్గ/ర్ జరిగిన స్పందించి మంటలను ఆర్పేవిధంగా విధి నిర్వహణలో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. పొలం పనులకు వెళ్లేవారు కూడా ఉదయమే పనులు ముగించుకోవాలన్నారు. ఎండకాలంలో కాటన్ దుస్తులు ధరించేవిధంగా ప్రజలకు
అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలోని ఏ మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుందో గమనించి ఆయా మండలాల్లోని మేజర్ గ్రామ పంచాయతీల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
మండల కార్యాలయాల్లో చలివేంద్రాలు




