రఘునాథ పాలెం జులై 07(జనం సాక్షి)
ఆర్ సి ఓ పరిరక్షణలో లేని గురుకులాలు.
పిడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మండల బీసీ బాయ్స్ గురుకులాన్ని సందర్శించారు
ఈ సందర్భంగా పిడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి జి మస్తాన్ మాట్లాడుతూ. ఖమ్మం జిల్లాలో ఉన్న మండల కేంద్రంలో ఉన్న బిసి గురుకులాన్ని వారు సందర్శించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు కావస్తున్న గురుకులాలు ఏమాత్రం అభివృద్ధి చెందకుండా ఉన్నాయి విద్యార్థులు చదువుకోవాలంటే కరెంటు వైర్లతో ఎలాడుతున్న గదులలో చదువుతున్న పరిస్థితి అధికారులు ఆర్సిఓ ఏమి పట్టించుకోకుండా నిమ్మికి నేరెత్తిన లాగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఈగల తోని భోజనం పెడుతూ వాటర్ లేక సరిగా కరెంటు లేక గురుకులల్లో సరిగా వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడిన పరిస్థితి కనపడుతుంది నోటు పుస్తకాలు అందక ఫ్యాన్లు లేక టీచర్స్ సరిగా లేక స్విచ్ బోర్డులు సరిగా లేక ట్యూబ్ లైట్లు కరెంటు వైర్లు పట్టుకుంటే షాక్ కొట్టేలాగా కొట్టే పరిస్థితి ఆ గురుకులంలో ఉంది ఆర్సిఓ ఏమి పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు తక్షణమే ఆర్సిఎఫ్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నోటు పుస్తకాలు అందించాలని ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తక్షణ స్పందించాలని వారిని కోరుతున్నాం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాల సమస్యలు పరిష్కరించాలని సొంత భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం నేను పక్షంలో పిడిఎస్యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని వారిని హెచ్చరికలు జారీ చేస్తున్నాం
ఈ కార్యక్రమంలో. మణికంఠ చింటూ గోపి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో ఉన్న బిసి బాయ్స్ గురుకులాల సమస్యలు పరిష్కరించాలి..




