Sunday, 8 November 2026

మండల కేంద్రంలో క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన గ్రామ సర్పంచ్ పొడవు శ్రీనివాసులు

మండల కేంద్రంలో క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన గ్రామ సర్పంచ్ పొడవు శ్రీనివాసులు

 

గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (25): గోపాల్ పేట్ మండల కేంద్రం లో క్రైస్తవుల ప్రార్ధన మందిరంలో ఆదివారం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జరిగిన క్రైస్తవ సోదరుల ప్రత్యేక ప్రార్థనలో గ్రామ సర్పంచ్ పొడువు శ్రీనివాసులు హాజరై కేక్ కట్ చేసి క్రైస్తవ ఫాస్టర్లకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయనమాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము అని అన్నారు ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవ సోదరులు గ్రామ సర్పంచ్ శ్రీనివాసులును శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పాస్టర్ బెంజిమెన్, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.