కౌడిపల్లి జనంసాక్షి…….
మండలపరిదిలోని పలు గ్రామల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి.
గ్రామములోని మహిళలు తంగేడు, గునుగు, సీతాజడలు, బంతి, చామంతి ఫిరంగి, గన్నేరు తీరొక్కపూవులతో బతుకమ్మలను అందంగపేర్చి గ్రామంలోని వాడ వాడల నుండి బతుకమ్మలను ఏత్తుకొని డప్పు చప్పుడుతో ఊరేగింపుగా హనుమాన్ దేవాలయంవద్దకు చేరి అందరూ ఒకచోట బతుకమ్మలు పెట్టి ఉయ్యాల బతుకమ్మ ఆటలు పాటలు ఆడారు. సాయంత్రం వరకు ఆడబిడ్డలు ఎంతో సంతోషంగా ఆట పాటలు ఆడుకుంటూ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పట్టు చీరల తళుక్కులు, సప్తవర్ణ శోభితంగా బతుకమ్మ పండుగ కు కొత్తవన్నెను తెచ్చాయి.చిన్నారులు యువతులు డి,జె .బతుకమ్మ పాటలకు అనుగుణంగా లయబద్దంగా నృత్యాలు చేస్తూ బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకున్నారు.
అనంతరం మహిళలు బతుకమ్మలనెత్తుకొని బారి ఊరేఘింపుగా ముందుకు కదులుతూ పాటలు పాడుకుంటూ గౌరమ్మకు ప్రతీక అయిన బతుకమ్మ ను గ్రామ సమీపంలోని వాగులో గంగమ్మ సన్నిధిలో నిమజ్జనం చేసి, పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా అంటూ వాయనాలు పంచుకుని బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగ సందర్బంగా వివిధ గ్రామాల్లోని సర్పంచులు నాయకులు బతుకమ్మ పండుగ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.




