మండల పూజకు మంత్రి జగదీష్ రెడ్డిని ఆహ్వానించిన గోవింద మాల భక్త బృందం
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): ఈనెల 26న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న గోవింద మాల మండల పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని గోవింద మాల భక్త బృందం సభ్యులు శనివారం క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.సోమవారం వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో స్వామివారిని 108 కలశములతో, పంచామృతాలతో మండల పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలచార్యులు తెలిపారు.మంత్రిని కలిసిన వారిలో రాంరెడ్డి శ్రీనివాసరెడ్డి, దంతాల నాగరాజు, గుండా శ్రీనివాస్ , బూర నాగరాజు గౌడ్, మట్టా రమేష్ తదితరులున్నారు.




