సంస్కృతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 2023 సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కొండమల్లేపల్లి డిసెంబర్ 24 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో శనివారం నాడు సంస్కృతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 2023 వ సంవత్సర నూతన క్యాలెండర్ ను విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులచే ఆవిష్కరించారు 2023 వ సంవత్సర నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం, హర్షం వ్యక్తం చేశారు ఎంతో ప్రతిష్టాత్మకమైన నూతన క్యాలెండర్ ను మాచే ఆవిష్కరించడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామని విద్యార్థులు తల్లిదండ్రులు పేర్కొన్నారు సంస్కృతి పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఎంతో తెలివిగలవారని ఆంగ్ల భాషలో మంచిపట్టున్న ఉపాధ్యాయులచే బోధించడం పట్ల పిల్లలు ఆసక్తిగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారని తల్లిదండ్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో సంస్కృతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సైనిక్, గురుకుల, ఐఐటి, నవోదయ పోటీ పరీక్షలో నెగ్గడం కోసం నాణ్యమైన విద్యతో పాటు మంచి కోచింగ్ ఇప్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు సంస్కృత ఇంగ్లీష్ మీడియం పాఠశాల మేనేజ్మెంట్ ను కోరారు అనంతరం సంస్కృతి స్కూల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు మరియు చిట్టి పొట్టి చిన్నారులు స్వయం పరిపాలన దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు విద్యాభ్యాసం చేశారు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆట పోటీలు నిర్వహించారు గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో సంస్కృతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
సంస్కృతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 2023 సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ




