Wednesday, 4 November 2026

మండల భా జ పా కార్యవర్గ సమావేశం.

 

 

 

 

 

– మండల అధ్యక్షులు సాయిశ్రీను అధ్వర్యంలో…బూర్గంపహాడ్ ఫిబ్రవరి 10 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల భా జ పా పార్టీ కార్యవర్గ సమావేశం సారపాక ఆ పార్టీ కార్యాలయం లో మండల అధ్యక్షులు సాయిశ్రీను అధ్వర్యంలో నిర్వహించినారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మహబూబబాద్ పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రెటరీ రాజోజుల శ్రీనివాస్ చారీ, పినపాక అసెంబ్లీ ఆర్గనైజర్ సెక్రెటరీ కొండి ప్రభాకర్, బీజేపీకిసాన్ మోర్చారాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా సీతారాం నాయక్, మొరంపల్లి బంజార సర్పంచ్ దివ్యశ్రీ, కిసాన్ మోర్చ సీనియర్ నాయకులు గుగులోత్ బాలు నాయక్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ బిజ్జం శ్రీనివాస్ రెడ్డి, ఓ బి సి జిల్లా ప్రధాన కార్యదర్శి కేశగాని శ్రీనివాస్ గౌడ్, జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులు దుప్పటి సురేష్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య వెంకటేశ్వర్లు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు పాలం రవీందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బానోత్ వినోద్ నాయక్, బి ఎం ఎస్ నాయకులు బిజ్జం అశోక్ రెడ్డి, వై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.