రుద్రూర్, జూన్ 5 (జనం సాక్షి ) :రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బాజార్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న మండల సమీకృత సముదాయ భవనాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర శాసనభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. మండల సమీకృత సముదాయ భవన నిర్మాణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి అధికారులకు అప్పజెప్పాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. స్పీకర్ వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి నేరుగంటి బాలరాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ తోట సంగయ్య , మాజీ విండోచైర్మన్ పత్తి రాము, నాయకులు అక్కపల్లి నాగేందర్ , తిగుళ్ల రాజా వరప్రసాద్, ఖలీమ్ ఖురేషి, మండల సోషల్ మీడియా కన్వీనర్ లాల్ మహమ్మద్ , గ్రామ మైనార్టీ సెల్ అధ్యక్షుడు జమీల్, పత్తి నవీన్, సీతారాం, నాయకులు తదితరులు పాల్గొన్నారు




