వరంగల్ ఈస్ట్ జూన్ 06 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో గల ఉరుసు రంగసముద్రం చెరువు నాలా కబ్జాకు గురైన సంఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు మంగళవారం రంగ సముద్రం చెరువు కింద వ్యవసాయం చేసుకునే రైతులు నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే ఈ చెరువుకు సంబంధించిన సర్వేనెంబర్ 375, 378, 381, 382, 383 మొదలైన సర్వే నంబర్ల లో గల రైతులు తమ వ్యవసాయం కోసం పూర్వం నుండి చెరువు తూము ద్వారా వచ్చే కాలువ నుండి రైతులు పంటలు పండించుకునేవారు. అయితే ఈ కాలువ సుమారు ఐదు ఫీట్ల వెడల్పు తోటి ఉంది. ఈ కాలువ బట్టుపల్లి బైపాస్ రోడ్డు ద్వారా బొంది వాగులోకి నీళ్లు చేరేవి అయితే 100 ఫీట్ల వెడల్పుతో ఉన్న బట్టుపల్లి రోడ్డు కింది భాగము నుంచి మోరి ద్వారా నీళ్లు వెళ్ళేవి. అయితే ప్రస్తుతం ఈ మోరి పక్కన ఉన్నటువంటి ప్లాట్ యజమాని మోరిని కబ్జా చేయడమే కాకుండా మోరి నుండి నీళ్లు వెళ్లకుండా మట్టి పోసి చదును చేయడం కనిపించింది. దీంతో రైతులు నిరసన వ్యక్తం చేసి మోరిని కబ్జా కాకుండా మోరి నీళ్లు సులభంగా వెళ్లి పోయేలా చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా కార్పొరేషన్ సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ముజమిల్, కుమార్ తదితరులు ఆక్రమణకు గురైన స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆక్రమణకు గురైన మోరి నాలా పై తగిన చర్యలు తీసుకోవడం తోపాటు ఇరిగేషన్ అధికారులతో కూడా వచ్చి మరోసారి పరిశీలిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు బండి మల్లేశం, భౌరిశెట్టి మల్లేశం, కాబట్టి కేదారి, సముద్రాల స్వామి, బండి సమ్మయ్య, అడ్డూరి వెంకటేశ్వరరావు, బుక్క కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.




