Saturday, 7 November 2026

రామాలయంలో చోరీకి పాల్పడ్డ దుండగులు

రామాలయంలో చోరీకి పాల్పడ్డ దుండగులు

హుండీ తాళం విరగొట్టి డబ్బులు అపహరణ

గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (26): మండల కేంద్రంలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చొరబడి ఉండి తాళం పగలగొట్టి డబ్బులు దోచుకెళ్ళారు ఎస్సై నవీద్ కథనం మేరకుస్థానిక కోదండ రామస్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయం ప్రధాన ద్వారం తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు హుండీ తాళం పగలగొట్టి హుండీలోడబ్బులు సుమారు 5000 దోచుకెళ్ళారు సోమవారం ఉదయం ఆలయ అటెండర్ బాలయ్య గమనించి ఆలయ క్లాక్ నాగేష్ కు పోలీసులకు సమాచారం అందించాడు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ను రప్పించి చేతి ముద్రలు సేకరించారు ఆలయ గర్భగుడిలో సిసి ఫుటేజ్ ను పరిశీలించారు దుండగులు సీసీ కెమెరాలు ధ్వంసం చేయడంతో పూర్తిగా రికార్డు కాలేదు కారు లో నలుగురు పురుషులు ఇద్దరు స్త్రీలు వచ్చి ఆలయంలోకి ప్రవేశించినట్లుసీసీ ఫుటేజ్ లో గమనించినట్లు ఎస్సై తెలిపారు ఆలయ క్లర్క్ నాగేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు