Thursday, 5 November 2026

మండుటెండలో.. మంగళ హారతులతో.. ఊరుఊరున బిఎల్ఆర్ కు అపూర్వ స్పందన

మిర్యాలగూడ, జనం సాక్షి. మిర్యాలగూడనియోజకవర్గంలోకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  బత్తుల లక్ష్మారెడ్డి(బిఎల్ఆర్)  నిర్వహిస్తున్న పాదయాత్ర 10 వ రోజు శనివారం మిర్యాలగూడ మండలంఊట్లపల్లి, ఎర్రావులపాడు, కాల్వపల్లి తండా, కాల్వపల్లి గ్రామాలలో కొనసాగింది.ఊట్లపల్లి గ్రామం లో జరిగిన పాదయాత్రకు మండుటెండలో మహిళల మంగళహారతులు కోలాటాల మధ్య ఊరు ఊరు న అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బిఎల్ఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ సంక్షేమ రాజ్యం స్థాపించడానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.మిర్యాలగూడనియోజకవర్గంలో బిఎల్ఆర్ బ్రదర్స్ చేపడుతున్న సంక్షేమ పథకాలలను అధికార బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాపీకొడుతున్నారన్నారు.ప్రజాప్రతినిధులు అంటే కనీస మర్యాద ఇవ్వని బిఆర్ఎస్ ఎన్నికల ముందు చేస్తున్న జిమ్మిక్కులను గ్రహించాలని ప్రజలకు కోరారు. ఇచ్చిన హామీలను విస్మరించారని,రైతు రుణమాఫీ, రైతులకు సబ్సిడీలు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగులకు భృతి కల్పించలేదని బిఎల్ఆర్ ప్రశ్నించారు.కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు బనాయించి బెదిరిస్తున్నారనీమీ ఉడత ఊపులకు బెదిరిపోమని, కాంగ్రెస్ కార్యకర్తలకు బిఎల్ఆర్ బ్రదర్స్ ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నామన్నారు. పాదయాత్రలో ఉట్లపల్లి సర్పంచ్ తక్కెలపల్లి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మేడ సురేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిలే శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, తలకొప్పుల సైదులు మాదిగ, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.