Tuesday, 3 November 2026

మండే ఎండలు.. బహుపరాక్..

8w5ohohbహైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఎండల తీవ్రతకు వడగాలులు కూడా విజృంభిస్తున్నాయి. దీంతో వృద్థులు, పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారంటూ రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. వడగాల్పుల నేపథ్యంలో వెంటనే కార్యచరణ ప్రణాళిక అమలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశించింది. ఎండ దెబ్బ తగలకుండా ఎలా వ్యవహారించాలో ప్రజల్లో అవగాహన కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో వడగాలుల తీవ్రతకు సంబంధించిన పిల్‌ విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
వడదెబ్బ..
వడగాలులకు మనుషుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వడదెబ్బపై ఎలాంటి అవగాహాన లేకపోవడం వల్ల గత నాలుగేళ్లలో 1232 మంది చనిపోయారని సీనియర్ జర్నలిస్టు పిట్టల శ్రీశైలం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. 2003లో డాక్టర్ పషోరీ కమిటి నిబందనలు తెలుగు రాష్ట్రాలు పట్టించుకోవడం లేదన్నారు. వడగాల్పుల నుండి ప్రజలను రక్షించడంలో ఒడిస్సా ప్రభుత్వం మంచి ఫలితాలను సాధిస్తోందన్నారు. ఇక్కడ కూడా అలాంటి ఆదేశాల్ని జారీచేయాలని కోరారు. దీంతో గతంలో పలుమార్లు విచారణ చేపట్టిన ఉమ్మడి ఉన్నత న్యాయస్థానం..తాగాజా కౌంటర్లు దాఖలు చేసి నివేదికలు ఇవ్వాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాల్ని అదేశించింది. అయితే గతంలోనే తెలంగాణ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. తాజాగా సోమవారం ఏ.పి. అమలు చేయనున్న యాక్షన్ ప్లాన్ ను కోర్టుకు సమర్పించింది.
అవగాహన కల్పించాలి..
ఇరు రాష్ట్రాల యాక్షన్ ప్లాన్స్‌లో మధ్యాహ్నాం 12 గంటల నుంచి 3 గంటల వరకు పనులకు వెళ్లకుండా ప్రజలకు అవగాహాన కల్పిస్తున్నామని తెలిపాయి. అన్ని విభాగాలను హెల్త్ సెంటర్స్ ను, హాస్పటల్స్ ను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఎండకు వెళ్లే సమయంలో ఏం చేయాలి ఏం చేయకూడాదో ప్రజలకు చెప్తున్నామని నివేదిక ఇచ్చారు. ఇక మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు మీడియాతో, రేడియోలతో అప్రమత్తం చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది. అయితే ఇవి ఎలా అమలు చేస్తున్నారో చూడాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది. పిటిషనర్ కూడా గ్రామాలకు వెళ్లి అవగాహాన కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు కూలీల్లో 12 గంటల తర్వాత పని చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించింది. గ్రామాల్లో వాల్ పోస్టర్లు, పనులు జరిగే ప్రదేశాల్లో వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే బోర్డులు ఏర్పాటు చేయాలని చీఫ్ జస్టిస్ దిలీప్.బి.బోసలే, నవీన్ రావుతో కూడిన బెంచ్ సూచించింది. వడగాల్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పించిన యాక్షన్ ప్లాన్ మూడు వారాలు సిరియస్ గా అమలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది కోర్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *