Monday, 2 November 2026

మంత్రిపై షూ విసిరిన ఎమ్మెల్యే

bikram_singh_majithiaపంజాబ్ అసెంబ్లీలో రచ్చ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మంత్రి బిక్రమ్ సింగ్ మజాతియాపై షూ విసిరాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే తర్లోచన్ సుంద్. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది కాంగ్రెస్ లోని హింసాత్మక ప్రవృత్తిని బయటపెడుతుందని వ్యాఖ్యానించార బిక్రమ్ సింగ్. అయితే తాను మంత్రిపై షూ విసరలేదని.. అకాలీ ఎమ్మెల్యే విర్సా సింగ్ పై విసిరితే అది పొరపాటున బిక్రమ్ పై పడిందన్నాడు. కులం పేరుతో విర్సా తనను తిట్టడంతోనే షూ విసిరానని వివరణ ఇచ్చాడు తర్లోచన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *