ప్రతిపక్షాలపై ఎంపీ బూర నర్సయ్య ఆగ్రహం
ప్రతిపక్షాలు పనిగట్టుకొని రైతుల వెంటపడ్డాయని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మండిపడ్డారు. ఇప్పటి వరకు తెలంగాణ లో నదీ జలాలవినియోగానికి సరైన ప్రణాళికలు లేవన్న ఆయన.. ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్ట్ లను అడ్డుకుంటున్న ఘనత కాంగ్రెస్ కె దక్కిందని విమర్శించారు. డిపిఆర్ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఉత్తమ్ కుమార్ నియోజకవర్గం లో 10 ఏళ్ళ కింద పులిచింతల ప్రాజెక్ట్ లో ముంపునకు గురైన 28 గ్రామాలకు ఆయన ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రతిపక్షనాయకులు తీరు మార్చుకోవాలని నర్సయ్య సూచించారు.