Monday, 2 November 2026

మూడు రోజుల వరకు రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

rainహైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు. రాగల రెండు, మూడు రోజుల వరకు రెండు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర కోస్తాంధ్ర, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అధికారులు వెల్లడించారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెప్పారు. కోస్తాంధ్రలో రెండ్రోజుల పాటు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. తెలంగాణలోనూ రెండ్రోజల వరకు .. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వివరించారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగతున్నాయని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *