ఖానాపూర్ రూరల్17 మే (జనం సాక్షి): వేదజల్లే పద్ధతిలో వరి వేస్తే అధిక లాభాలు పొందవచ్చు అని ఖానాపూర్ ఎమ్ ఏ ఓ అసం రవి అన్నారు.బుధవారం పాత ఎల్లపూర్ గ్రామంలో రైతు ఐతే రమేష్ అనే వ్యక్తి తన పంట పొలాల్లో వెదజల్లే పద్ధతి లో వరి పంట ను సాగు చేసే విధానాన్ని చూడడానికి పాత ఎల్లపూర్,పాత తర్లపాడ్, బావపూర్ కె గ్రామానికి చెందిన30 మంది రైతులు ఈ వెదజల్లే పద్దతి ద్వారా వరి పంట సాగును చూడడానికి వచ్చారు.ఈ వెదజల్లే పద్ధతి గురించి ఎమ్ ఏ ఓ అసం రవి రైతులకు వివరించారు.దీనికి రైతులు వచ్చే వర్షా కాలంలో వెదజల్లే పద్దతి ద్వారా వరి సాగు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ మనిషా,రాకేష్,రైతులు పాల్గొన్నారు.




