మంత్రి తలసాని సాయంత్రం వరకు సారి చెప్పు!- ఎస్టీలను ఏకంచేసి మా పవర్ ఏంటో చూపిస్తాం..! – గిరిజన నాయకులు సురేష్ బాబు…
భైంసా. రూరల్ జనం సాక్షి ఆగస్టు 21 మంత్రి తలసాని శ్రీనివాస్ రాజేష్ బాబుకి సాయంత్రం వరకు సారి చెప్పాలంటూ గిరిజన నాయకులు సురేష్ బాబు అన్నారు. సోమవారం ముధోల్ మండల కేంద్రంలోనీ ప్రధాన రహదారిలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు అభిమానులు,గిరిజనులు రాస్తారోకో,ధర్నా చేశారు.అనంతరం మాట్లాడారు…తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమం పట్లనిలిచి తెలంగాణ సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించారని, అలాంటి వ్యక్తిని మంత్రి తలసాని శ్రీనివాస్ హైదరాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో గల్లపట్టి,చే జేసుకోవడం గిరిజనులను అవమానపరిచినట్లేనన్నారు. సాయంత్రం వరకు రాజేష్ బాబుకి మంత్రి క్షమాపణ చెప్పాలనీ, లేకపోతే పెద్ద మొత్తంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు అందించారు.విరివెంట ముధోల్ మేజర్ గ్రామ సర్పంచ్ వెంకటపురం రాజేందర్,రాజేష్ బాబు అభిమానులు,గిరిజనులు తదితరులు ఉన్నారు.