Friday, 6 November 2026

మంత్రి ప్రశాంత్ రెడ్డీ సహకారంతో 11 మంది

మంత్రి ప్రశాంత్ రెడ్డీ సహకారంతో 11 మంది ఆడపడుచులకు కళ్యాణాలక్ష్మీ,షాధిముబారక్ చెక్కులు పంపిణీ

బాల్కొండ నవంబర్ 23(జనం సాక్షి ) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం 4 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ,షాధిముబారక్ చెక్కులను ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్,జడ్పీటీసీ సభ్యులు దాసరి లావణ్య-వెంకటేష్,తహశీల్దార్ వినోద్,మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి,వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్ చేతుల మీదుగా 11 కల్యాణలక్ష్మీ,షాధిముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విదంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపడుచుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మీ,షాధిముబారక్ పథకాన్నీ ప్రవేశ పెట్టారని ఒక్కొక్క లబ్దిదారులకు రూ1 లక్ష ఒక వంద పదహారు రూపాయలు చొప్పున అందజేయడం జరిగిందని వారు తెలిపారు.ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.పేద కుటుంబాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక తోబుట్టువుగా ఉన్నారని ప్రతీ ఒక్క ఆడపడుచుకు లబ్ది చేకూరుతుందని తెలిపారు.లబ్ధిదారులు మంజూరు చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి, కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్లు సంతకుల సాయమ్మ-జువ్వన్న,నాగులభూదేవి-పల్లి కిషన్,ఎంపీటీసీలు మామిడి దివ్యా- రాకేష్,కన్న లింగవ్వ-పోశెట్టి,మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ అలీ,ఉప సర్పంచ్లు షేక్ వాహబ్,పస్తం చిన్న రాజన్న,నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తౌటు గంగాధర్,సొసైటీ చైర్మన్ నాగులపల్లి సూరజ్ రెడ్డి,తెరాస మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,గ్రామ శాఖ అధ్యక్షులు సాగర్ యాదవ్,రైతు బంధు మండల కో ఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్,వేల్పూర్ మార్కెట్ డైరెక్టర్లు వేంపల్లి చిన్న బాల్ రాజేశ్వర్,సయ్యద్ మాజారోద్దీన్,సొసైటీ డైరెక్టర్లు డాక్టర్ ప్రసాద్ గౌడ్,మండల గంగారాం,గ్రామ శాఖ అధ్యక్షులు ఎనుగందుల శ్రీనివాస్, కోటగిరి శ్రీకాంత్ చారి,మాజీ కో ఆప్షన్ సభ్యులు MA షాహిద్,మాజీ ఎంపీటీసీ సభ్యులు మహమ్మద్ ఇఫ్తాకారోద్దీన్,తొగటి మురళీ,నార్ల రాజు,రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ రమేష్,RI రాఘవేందర్,ఫయీమ్,రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.